: పవన విద్యుత్ రంగంలోకి ‘నారా’ ఫ్యామిలీ... ‘అనంత’లో తొలి ప్లాంటును ప్రారంభించిన హెరిటేజ్ ఫుడ్స్


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఆధ్వర్యంలోని ‘హెరిటేజ్ ఫుడ్స్’ విభిన్న రంగాల్లోకి అడుగు పెడుతోంది. నిన్నటిదాకా పాల వ్యాపారం, రిటెయిల్ వ్యాపారంతోనే సరిపెట్టుకున్న ఆ కంపెనీ తాజాగా పవన విద్యుదుత్పత్తి రంగంలోకి అడుగుపెట్టింది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చైర్మన్ గా ఉన్న ఈ కంపెనీలో ఆయన కోడలు నారా బ్రాహ్మణి కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఏటికేడు నారా కుటుంబానికి లాభాల పంట పండిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్.. తాజాగా పవన విద్యుత్ ఉత్పత్తికి నిన్న శ్రీకారం చుట్టింది. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చిన హోతూర్ గ్రామంలో 2.1 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేసిన పవన విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిన్న ప్రారంభించినట్లు ఆ కంపెనీ తెలిపింది. ఈ విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను బయటి వ్యక్తులు, సంస్థలకు కాకుండా సొంత అవసరాలకే వినియోగించుకోనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. అనంతపురం జిల్లాలో తాను తయారు చేస్తున్న విద్యుత్ ను... చిత్తూరు జిల్లాలోని తన డెయిరీ ప్లాంట్లకు వాడుకుంటామని పేర్కొంది. దేశీయ పవన విద్యుదుత్పత్తి రంగంలోని అత్యంత ఆధునిక టెక్నాలజీని ‘అనంత’ ప్లాంట్ లో వినియోగించుకోనున్నట్లు హెరిటేజ్ ఫుడ్స్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News