: దావూద్ ఇబ్రహీం లెక్క తప్పింది!... ధోనీ సేన ఓడింది!


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం... ముంబై బాంబు పేలుళ్ల తర్వాత దేశం వదిలి పారిపోయాడు. అయితే దేశానికి సంబంధించిన వ్యవహారాలపై నిత్యం కన్నేసి ఉంచే విషయాన్ని మాత్రం అతడు మానలేదు. సినీ రంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న అతడు... టీమిండియా ఆడే మ్యాచ్ లపై బెట్టింగ్ నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నాడు. తాజాగా నిన్నటి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ పైనా అతడు కన్నేశాడు. అంతేకాదండోయ్... ఆ మ్యాచ్ లో వెస్టిండీస్ సంచలనం క్రిస్ గేల్ చెలరేగి ఆడినా విజయం మాత్రం ధోనీ సేనదేనని జోస్యం చెప్పాడు. ఈ మేరకు మ్యాచ్ కు ముందు నిన్న మధ్యాహ్నం నుంచి నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రసారమయ్యాయి. కోహ్లీ కంటే రోహిత్ శర్మ మ్యాచ్ లో సత్తా చాటుతాడని కూడా దావూద్ అంచనా వేశాడు. అయితే రోహిత్ శర్మ గత మ్యాచ్ ల్లో కంటే కాస్తంత మెరుగ్గా ఆడినా, కోహ్లీ కంటే మెరుగైన ఆటతీరు ప్రదర్శించలేకపోయాడు. ఇక క్రిస్ గేల్ పంజా విసరకపోయినా, ధోనీ సేన మాత్రం పరాజయం పాలైంది.

  • Loading...

More Telugu News