: కోహ్లీ గెలిచాడు...గేల్ ఓడాడు!


టీమిండియా నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యఛేదనను వెస్టిండీస్ టీమ్ నెమ్మదిగా ఆరంభించింది. గేల్ సునామీ ధాటికి టీమిండియా ఫైనల్ చేరుతుందా? అని అభిమానుల గుండెల్లో ప్రశ్నలు మెదులుతుండగానే బుమ్రా తన అద్భుతమైన బంతితో గేల్ (5)ను పెవిలియన్ కు పంపాడు. వెస్టిండీస్ ఆ షాక్ నుంచి తేరుకునే లోపు ఆశిష్ నెహ్రా, శామ్యూల్స్ (8) ను అవుట్ చేశాడు. దీంతో వెస్టిండీస్ జట్టు రెండు గెలుపుగుర్రాల వికెట్లు ఆదిలోనే కోల్పోయింది. దీంతో క్రీజులోకి వచ్చిన ఛార్ల్స్ (29), సిమ్మన్స్ (21) అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. ప్రధానంగా ఛార్ల్స్ భారీ షాట్లతో ఆకట్టుకుంటున్నాడు. దీంతో 9 ఓవర్లు ఆడిన వెస్టిండీస్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. 7వ ఓవర్ 5వ బంతికి లెండిల్ సిమ్మన్స్ ఆడిన బంతిని బుమ్రా అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు. దీంతో మూడో వికెట్ పడిందని అంతా సంబరపడ్డారు. రీ ప్లేలో బంతిని చూసిన థర్డ్ అంపైర్ నోబాల్ గా ప్రకటించాడు. దీంతో ఆ వికెట్ పడలేదు. గేల్ తక్కువ స్కోరుకే అవుటవడంతో కోహ్లీ, గేల్ పోరాటంగా పేర్కొన్న ఈ మ్యాచ్ లో కోహ్లీ విజయం సాధించగా, గేల్ ఓడాడు.

  • Loading...

More Telugu News