: వంద పరుగుల మార్కు దాటిన టీమిండియా


ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఆకట్టుకుంటోంది. నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు పుంజుకుంటోంది. ఇన్నింగ్స్ కు జెట్ వేగం తీసుకువచ్చిన రోహిత్ శర్మ (43) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో బ్యాటు ఝుళిపించే బాధ్యతను రహానే భుజానికెత్తుకున్నాడు. జాగ్రత్తగా ఆడుతూనే అవకాశం చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ లైన్ దాటిస్తున్నాడు. అతనికి కోహ్లీ జత కలవడంతో తెలివిగా సింగిల్స్ తస్కరిస్తూనే భారీ షాట్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో 12.2 ఓవర్లలో టీమిండియా వంద పరుగుల మార్కు దాటింది. 14 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోయి 120 పరుగులు చేసింది. కోహ్లీ (34), రహానే (39) క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News