: ఈ మ్యాచ్ కి టాస్ కీలకం... విజేతను నిర్ణయించేది అదే!
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా కాసేపట్లో భారత్-వెస్టిండీస్ జట్లు టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్ ను ఆడనున్నాయి. రెండు జట్లలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లున్నారు. కీలకమైన ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధించినా టైటిల్ ఫేవరేట్ గా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ లో టాస్ కీలకంగా మారనుంది. విండీస్ బౌలర్లు వేగం, బౌన్స్ ఉన్న పిచ్ లను ఇష్టపడతారు. అదే సమయంలో టీమిండియా స్లో పిచ్ లను ఇష్టపడుతుంది. బీసీసీఐ నిర్వహించే టోర్నీ అయితే పిచ్ భారత జట్టుకు అనుకూలంగా రూపొందించే అవకాశం ఉంది. ఈ టోర్నీని ఐసీసీ నిర్వహించడంతో పిచ్ ఎలా ఉండనుందో పిచ్ మీద అడుగుపెడితే కానీ అర్థం చేసుకోవడం కష్టం. ఈ నేపథ్యంలో మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన ఏ జట్టైనా ఫీల్డింగ్ ఎంచుకునేందుకు మొగ్గుచూపే అవకాశం ఉంది. తొలుత బ్యాటింగ్ చేస్తే టార్గెట్ నిర్దేశించాల్సి ఉంటుంది. రెండు ఓవర్లు తల్లకిందులైనా లక్ష్యఛేదన సులభమవుతుంది. ఈ నేపధ్యంలో లక్ష్యఛేదనకే ఇరు జట్లు మొగ్గుచూపుతున్నాయి.