: 15 ఏళ్ల తరువాత మళ్లీ బాలీవుడ్ లోకి అరవింద్ స్వామి
'దళపతి' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసి, 'రోజా' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన నటుడు అరవిందస్వామి 15 ఏళ్ల తరవాత మళ్లీ బాలీవుడ్ లో అడుగుపెట్టనున్నాడు. అప్పట్లో 'బాంబే' సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న అరవిందస్వామి, ఆ తరువాత అర్థాంతరంగా సినిమాల నుంచి తప్పుకున్నాడు. 1998లో 'సాత్ రంగ్ కే సప్నె' సినిమాలో అరవిందస్వామి బాలీవుడ్ లో చివరిసారి కనిపించాడు. కొత్త దర్శకుడు తనూజ్ భ్రమర్స్ తెరకెక్కిస్తున్న 'డియార్ డాడ్' సినిమాతో తాను మళ్లీ ఇప్పుడు బాలీవుడ్ లో ఎంటర్ అవుతున్నానని అరవిందస్వామి చెప్పాడు. 14 ఏళ్ల కుమారుడుకి, తండ్రికి మధ్య అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న కథ తనను ఆకట్టుకున్నట్టు అరవిందస్వామి చెప్పాడు. కాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనుండగా, టీజర్ ను వచ్చేనెల మొదటి వారంలో విడుదల చేస్తారు.