: యూపీలో గూండాయిజానికి చరమగీతం పాడతాం: జేడీయూ
రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా జనతా దళ్(యునైటెడ్) మే4న వారణాసిలో ఎన్నికల శంఖారావం మోగించనుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వారణాసిలోని ఓ గ్రౌండ్‌లో తమ పార్టీ నేతలతో ఈ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. జేడీయూ నేత సతీశ్ కుమార్ ఈ విషయాన్ని ఈరోజు వారణాసిలో మీడియాకు తెలిపారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, ఇతర పార్టీలతో జేడీ(యూ) మహాకూటమి ఏర్పరచనుందని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ వారణాసి లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న విషయం తెలిసిందే. దేశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాత్రమే ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం అని ఈ సందర్భంగా జేడీయూ నేత సతీశ్ కుమార్ అన్నారు. యూపీలో జేడీ(యూ) అధికారంలోకి వస్తే బీహార్‌లో జరుగుతోన్న అభివృద్ధి యూపీలోనూ ప్రజలు చూస్తారని అన్నారు. యూపీలో గూండాయిజానికి చరమగీతం పాడతామన్నారు.