: హెచ్‌సీయూ గేటు వద్ద ఆందోళనకు దిగిన కేరళ ఎంపీలు
భద్రతా సిబ్బంది తమని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనికి అనుమతించట్లేదంటూ కేరళ రాష్ట్రానికి చెందిన సీపీఎం పార్లమెంటు సభ్యులు ఆ వర్సిటీ గేటు వద్ద ఆందోళనకు దిగారు. హెచ్‌సీయూలో ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘ నేతలకు సంఘీభావం తెలిపేందుకు ఎంపీలు వర్సిటీకి వచ్చారు. వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న దృష్ట్యా వర్సిటీలోకి ప్రవేశించడానికి అనుమతి నిరాకరించారు. దీంతో సీపీఎం పార్లమెంటు సభ్యులు వర్సిటీ లోనికి అనుమతించాలంటూ నిరసనకు దిగారు. కాగా, హెచ్‌సీయూలో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు విద్యార్థులు తగు సూచనలు, సలహాలివ్వాలని వీసీ అప్పారావు ఓ ప్రకటనలో కోరారు. వర్సిటీ ప్రాంగణంలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను విద్యార్థులు సూచించవచ్చని తెలిపారు.