: గర్భస్రావంపై మాటమార్చిన ట్రంప్
గర్భస్రావానికి పాల్పడే మహిళలను శిక్షించాలని వ్యాఖ్యలు చేసిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మాట మార్చారు. నలుమూలలనుంచీ విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన వెనక్కితగ్గారు. దీంతో తాను గర్భస్రావానికి పాల్పడే మహిళలను శిక్షించాలని అనడం లేదని, గర్భస్రావం చేసేవారిని శిక్షించాలని అన్నానని అంటున్నారు. విస్కాన్సిన్ సమావేశంలో క్రిస్ మాథ్యూస్ తో జరిగిన చర్చ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, గర్భస్రావాలు (అబార్షన్స్) పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టవ్యతిరేకంగా గర్భస్రావం చేయించుకునే మహిళలకు శిక్ష విధించాలని అన్నారు. ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుందని ప్రశ్నించగా, దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ట్రంప్ మాటమార్చారు.