: కామెరూన్‌తో మోదీ భేటీ
విదేశీ పర్యటనలో భాగంగా బెల్జియం ప్రధానితో బ్రస్సెల్స్‌లో ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈరోజు వాషింగ్టన్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీ.. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌తో భేటీ అయ్యారు. గత 12 నెలలుగా పనితీరు దిగజారుతున్న కారణంగా టాటా స్టీల్ బ్రిటన్‌లోని వ్యాపారాలకు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో.. ఆ అంశంపై కామెరాన్‌తో మోదీ చర్చించనున్నట్టు సమాచారం. వాషింగ్టన్ డీసీలో శుక్రవారం జరగనున్న అణుభద్రతా సదస్సులో ఇరువురు ప్రధానులు పాల్గొంటారు. ఈ క్రమంలో టాటా స్టీల్ అంశాన్ని బ్రిటన్ ప్రధాని ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. యూకేలోని తమ సంస్థను పూర్తిగా కానీ.. భాగాలుగా కానీ విక్రయించాలని నిర్ణయానికి వచ్చినట్లు బోర్డు సమావేశం తర్వాత కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.