: అంకారా, ఇస్తాంబుల్, టర్కీ నగరాలకు వెళ్లొద్దు: హెచ్చరించిన ఆస్ట్రేలియా


ప్రముఖ పర్యాటక కేంద్రాలు అంకారా, ఇస్తాంబుల్, టర్కీ వంటి పట్టణాలకు వెళ్లవద్దని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ దేశ ప్రజలను హెచ్చరించింది. ఈ పట్టణాల్లో ఐఎస్ఐఎస్ దాడులకు ప్రణాళికలు రచించిందన్న సమచారం ఉందని తెలిపింది. ఈ నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో ఐఎస్ఐఎస్ బాంబు దాడులకు పాల్పడి 80 మంది మరణానికి కారణమైందని ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రకటన జారీ చేస్తున్నామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. బ్యాట్ మాన్, బింగోల్, బిట్లిస్, గాజియన్ టెప్, హక్కారీ, హాతే, మార్డిన్ వంటి ప్రాంతాలకు బాంబు దాడుల హెచ్చరికలు వస్తున్నాయని ఈ ప్రకటనలో పేర్కొంది.

  • Loading...

More Telugu News