: బాలికను కిడ్నాప్ చేయబోయిన సీఆర్పీఎఫ్ జవాన్ అరెస్టు


పదమూడేళ్ల దళిత బాలికను కిడ్నాప్ చేయబోయాడనే ఆరోపణలపై సీఆర్పీఎఫ్ జవాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని బాలియా జిల్లాలో ఉన్న రాజేంద్రనగర్ ప్రాంతంలో నిన్న రాత్రి ఈ సంఘటన జరిగింది. జిగిరిసర్ గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ ముఖేష్ సింగ్ ఛత్తీస్ గఢ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. లీవ్ పై ఇంటికి వచ్చిన ముఖేష్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలికను అపహరించుకుపోయేందుకు యత్నించాడనే ఆరోపణలపై ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు, పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ అధికారులకు కూడా తెలియజేశామన్నారు.

  • Loading...

More Telugu News