: పారిస్‌లో హెన్రి లాంగ్లోయిస్ అవార్డు అందుకున్న కమల్‌హాసన్
తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ... ఇలా అన్ని దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీ చిత్రాల్లో కూడా నటించి నటనకే కొత్త భాష్యం చెప్పిన నటుడు కమల్‌హాసన్. నాలుగు జాతీయ సినీ అవార్డులను అందుకొని, నటనతో లోకనాయకుడిగా పేరుపొందిన ఆయన ఇటీవల పారిస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మరో అవార్డు అందుకున్నారు. భారత చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవకు గానూ కమల్‌హాసన్‌కు హెన్రి లాంగ్లోయిస్ అవార్డును ప్రదానం చేశారు. ఈ విషయాన్ని కమల్‌హాసన్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. తన గురువు అనంతు ఆశీస్సుల వల్లే తనకు ఈ అవార్డు దక్కిందని, ఈ సమయంలో ఆయన ఉంటే ఎంతో సంతోషించేవారని ట్వీట్ చేశారు.