: బైక్ పై వచ్చి బాలికను అపహరించుకుపోయారు
ఏడేళ్ల బాలిక కిడ్నాప్ నకు గురైన సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈరోజు మధ్యాహ్నం జరిగింది. ఇక్కడి కొత్తపేటకు చెందిన సహస్ర(7) అనే చిన్నారి తమ ఇంటి ముందు ఆడుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. హెల్మెట్లు ధరించి ఉన్న ఇద్దరు వ్యక్తలు బ్లాక్ పల్సర్ పై వచ్చి ఆడుకుంటున్న చిన్నారిని అపహరించుకుపోయారు. ఈ సంఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సహస్ర తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులని, ఈ సంఘటన జరిగిన సమయంలో ఇంటి వద్ద బాలిక అమ్మమ్మ ఉన్నట్లు సమాచారం.