: అసెంబ్లీ నుంచి పారిపోయారు...బయట అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు: కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ నుంచి టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఎందుకు పారిపోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. శాసనసభలో రికార్డెడ్ గా ఉండాలని తాను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తానని చెబితే, టీడీపీ, కాంగ్రెస్ లు గుడ్డిగా వ్యతిరేకించాయని ఆయన అన్నారు. తానేమన్నా అన్ పార్లమెంటరీ భాష మాట్లాడిన్నా, తానేమన్నా అవాకులు చవాకులు మాట్లాడిన్నా? అని ఆయన ప్రశ్నించారు. వారిలెక్క తానేమన్న అబద్దాలు చెప్పిన్నా? అని ఆయన అడిగారు. శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు హాజరుకాకుండా శాసనసభ బయట అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు రమ్మన్న ఆహ్వానాన్ని మన్నించి వచ్చి గ్యాలరీలో కూర్చుని అంతా విన్న శాసన మండలి సభ్యులకి ధన్యవాదాలని ఆయన చెప్పారు. తాను ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై ఏ విధమైన సలహాలు, సూచనలు ఇవ్వాలంటే ఇవ్వాలని ఆయన శాసనసభ్యుల, శాసన మండిలి సభ్యులను కోరారు.