: చంద్రబాబు నాకు మిత్రుడే...900 టీఎంసీల నీరు సాధిస్తాం: కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు మిత్రుడేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణ శాసనసభలో ఆయన మాట్లాడుతూ, తాను చేసిన అయుత చండీ యాగానికి చంద్రబాబును ఆహ్వానించానని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయనను ఆహ్వానించడానికి వెళ్లినప్పుడు ఆయన తనకు భోజనం పెట్టిపంపారని అన్నారు. ఆ తరువాత ఆయనతో మాట్లాడుతూ, బతుకు, బతకనియ్యు అనేది తెలంగాణ ప్రజల సంప్రదాయమని, ప్రజలను మభ్యపెడదామంటే కుదరదని చెప్పానన్నారు. రెండు రాష్ట్రాలు జియోగ్రాఫికల్ గా పక్కనే ఉన్నాయని, తోసేస్తే వెళ్లిపోయే రాష్ట్రాలు కాదని ఆయన చెప్పారు. అందుకే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉందామని ఆయన చెప్పారు. గోదావరి నది నుంచి 900 టీఎంసీల నీరు తీసుకుంటామని ఆయన చెప్పారు.