: ఆ పార్టీ ఎక్కడ గెలిస్తే అక్కడ హింస చెలరేగుతుంది: రాహుల్
అసోంలోని డిగ్బోయ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ ఎక్కడకు వెళ్లినా ప్రజల్లో హింసను రెచ్చగొడుతోందని రాహుల్ అన్నారు. ప్రధాని ఎక్కడికి వెళ్లినా అభివృద్ధి గురించి మాట్లాడతారు గానీ, బీజేపీ ఏ రాష్ట్రంలో గెలిచినా అక్కడ మాత్రం హింస చెలరేగుతుందని అన్నారు. అసోంలోనూ ఆ హింస తిరిగొస్తే ఆ రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఆరెస్సెస్ పాలన నడుస్తుందని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే హరియాణా తరహా హింసాత్మక ఘటనలు పెరుగుతాయని, అందుకే ఆ పార్టీకి ఓటేయవద్దని సూచించారు. నల్లధనం మీద పోరాడుతానని మోదీ ఒకవైపు చెబుతూనే ఉన్నా, మరోవైపు మాల్యా లాంటివాళ్లు మాత్రం దేశం వదిలి పారిపోతున్నారని విమర్శించారు.