: గోవాలో ఎయిర్ టెల్ 4జీ సేవలు ప్రారంభం


గోవా లో 4జీ సర్వీసుని ప్రారంభించినట్లు ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎయిర్ టెల్ 4జీ ముంబయి హెడ్ అశోక్ గణపతి మాట్లాడుతూ, గోవా, గుజరాత్ సర్కిళ్లలో ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 4జీలోకి మారాలనుకుంటున్న వినియోగదారులు సిమ్ ని మార్చకుంటే సరిపోతుందని, హోండెలివరి సదుపాయం కూడా ఉందని, ఇప్పటికే ఉన్న ఎయిర్ టెల్ వినియోగదారులకు 3జీ ధరలకే 4జీని అందిస్తున్నట్లు చెప్పారు. 4 జీ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 10 సినిమాలను డౌన్ లోడ్ చేసుకునే స్పీడు ఈ నెట్ వర్క్ తో సాధ్యమన్నారు.

  • Loading...

More Telugu News