: ఏపీలో విద్యుత్ చార్జీల వడ్డన!... గృహ వినియోగదారులను వదిలేసిన ఏపీఈఆర్సీ!


ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు జరిగిపోయింది. ఇప్పటికే రోజుల తరబడి ఆయా జిల్లాల్లో విద్యుత్ చార్జీల పెంపు అంశంపై ప్రజాభిప్రాయాన్ని సేకరించిన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్సీ)... కొద్దిసేపటి క్రితం విద్యుత్ చార్జీలను పెంచుతూ కీలక ప్రకటన చేసింది. 2016-17 ఏడాదికి సంబంధించిన నూతన టారిఫ్ లను కమిషన్ చైర్మన్ భవానీ ప్రసాద్ హైదరాబాదులో కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. అందరూ ఊహించిన దానికి భిన్నంగా అడుగులేసిన ఈఆర్సీ... గృహ వినియోగదారులకు సింగిల్ పైసా చార్జీలను పెంచకుండా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక కమర్షియల్ వినియోగంపైనే విద్యుత్ చార్జీలను పెంచిన ఈఆర్సీ... సదరు టారిఫ్ ను 2 శాతం మాత్రమే పెంచింది. చార్జీల పెంపును రూ.216 కోట్లకు పరిమితం చేస్తూ కూడా ఈఆర్సీ సరికొత్త తరహాలో చార్జీలను పెంచింది. పెంచిన విద్యుత్ చార్జీలు రేపటి నుంచే అమలులోకి రానున్నట్లు కమిషన్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News