: భారత సైన్యానికి బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు రాబోతున్నాయ్!


శత్రు దేశాల చొరబాట్లను సమర్థంగా ఎదుర్కొనే భారత సైన్యానికి బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు రాబోతున్నాయి. భార‌త సైన్యం సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోంద‌ని విమ‌ర్శలు వ‌స్తున్న నేప‌థ్యంలో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్ల స‌దుపాయం ఊర‌టనిచ్చే విష‌య‌మే. ఇప్ప‌టి వ‌ర‌కు చాలీచాలని సదుపాయాలతో భారత సైన్యం నెట్టుకొస్తోంది. చాలా ప్రాంతాల్లో అధునాతన ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, మిస్సైల్, హెలికాప్టర్స్ కూడా వీరికి అందుబాటులో లేవు. అయితే భారత సైన్యానికి ఎట్టకేలకు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు అంద‌బోతున్నాయి. ఆర్మీకి త్వరలో 50వేల బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లను అందించ‌నున్న‌ట్లు ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం 3,53,765 బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు అవసరం ఉండగా ప్రస్తుతం అత్యవసరంగా 50వేల జాకెట్లను అందిస్తున్నారు. తొలివిడత 50వేల జాకెట్లను ఆగస్టు నుంచి సైనికులకు అందించనున్నారు. 2017 జనవరి వరకు అన్ని జాకెట్లను అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News