: బ్రస్సెల్స్ నుంచి వాషింగ్టన్ చేరుకున్న మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్ చేరుకున్నారు. రెండు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఆయన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నుంచి బయలుదేరి వాషింగ్టన్ చేరుకున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అణుభద్రతపై జరగనున్న నాలుగో శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. బ్రసెల్స్‌లో ఉగ్రవాద దాడులు జరిగిన వారం వ్యవధిలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న బెల్జియంలో ఒక్కరోజు పర్యటన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన భారత్-ఈయూ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన బెల్జియం ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.