: పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము చూడ‌బోం: బహిష్కరించిన కాంగ్రెస్‌, టీడీపీ


ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో సమగ్ర జల విధానంపై నిర్వహిస్తున్న‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్‌, టీడీపీ సభ్యులు ప్రకటించారు. దీంతో ఇరు పార్టీల సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. గూగుల్ ఎర్త్ సాయంతో దాదాపు మూడున్నర గంటల పాటు తెలంగాణ జల విధానాన్ని సీఎం కేసీఆర్ వివరించనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అసెంబ్లీ చరిత్రలోనే మొట్టమొదటిసారి అవుతుంది. హెలికాఫ్టర్ల ద్వారా తీసినటువంటి చిత్రాలు, కేంద్ర ప్రభుత్వ సర్వే సంస్థల సర్వే వివరాలతో ఈ ప్రజెంటేషన్ జరగనుంది.

  • Loading...

More Telugu News