: వరుసగా మూడో రోజు... లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. 109 పాయింట్ల పైగా లాభంలో సెన్సెక్స్, 31 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. ఇంధన, వాహన, ఐటీ రంగాలకు చెందిన వాటాలు లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు సానుకూల ప్రభావం చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న భారీ లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.