: భూవివాదంపై పూర్తి వివరాలు రేపు మధ్యాహ్నం తెలియజేస్తా: మంత్రి తలసాని


భూవివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు రేపు మధ్యాహ్నం తెలియజేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. భూ వివాదానికి సంబంధించి అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వరరావును తలసాని కొడుకు సాయి యాదవ్ బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలపై పోలీసు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ, డెవలప్ మెంట్ కోసం 53 ఎకరాలను ఆర్ఆర్ కన్ స్ట్రక్షన్స్ కు ఇచ్చారని, 2013 నుంచి ఈ వ్యవహారం కొనసాగుతోందని అన్నారు. ఆరుసార్లు మాట్లాడుకున్నాకే ఈ ఒప్పందం జరిగిందని, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఇంట్లో కూడా రెండుసార్లు చర్చించారని, అడ్వాన్స్ గా రూ.13 కోట్లు తీసుకున్నారని, గడవు పెరగడంతో డబ్బులు వాపస్ ఇవ్వాలని కోరామని, 'అప్పుడిస్తాము ఇప్పుడిస్తా'మంటూ కాలయాపన చేశారని అన్నారు. నిన్న మళ్లీ పదిరోజుల సమయం కావాలని కోరారని, ఈ వ్యవహారంలో రామకోటేశ్వరావును నమ్మలేకపోతున్నామని మా వాళ్లు అంటే, ఆయన మరో భూమి పత్రాలు ఇచ్చారని అన్నారు. తన కొడుకుపై కిడ్నాప్, బెదిరింపు ఆరోపణలు సరికావని తలసాని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News