: టీమిండియాకు గంగూలీ హెచ్చరికలు


టీమిడియాకు దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీ హెచ్చరికలు జారీ చేశాడు. వెస్టిండీస్ ఆట తెలుసని తేలిగ్గా తీసుకోవద్దని టీమిండియాకు సూచించాడు. విండీస్ బౌలింగ్ భారత్ పిచ్ లకు అతికినట్టు సరిపోతుందని అన్నాడు. ఐపీఎల్ లో వారి అనుభవం టీమిండియాను కట్టడి చేసేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు. గేల్, సిమ్మన్స్ తో కూడిన వారి బ్యాటింగ్ బలంగా ఉందని గంగూలీ తెలిపాడు. టీమిండియా అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తే తప్ప విండీస్ తో విజయం సాధించడం సులువు కాదని గంగూలీ పేర్కొన్నాడు. లక్ష్య ఛేదనలో సచిన్ కంటే కోహ్లీ గొప్ప ఆటగాడని గంగూలీ తెలిపాడు. సచిన్ గ్రేట్, అందులో సందేహం లేదు, అయితే లక్ష్య ఛేదనలో మాత్రం కోహ్లీ అద్భుతమైన ఆటగాడని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News