: కివీస్ జోరు కొనసాగుతోంది...90/1


న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్ల మధ్య మొహాలీ వేదికగా తొలి సెమీఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఆటగాళ్లు ఎప్పట్లా బ్యాట్లు ఝుళిపించారు. గుప్తిల్ (15) ను ఇంగ్లిష్ బౌలర్లు ఆదిలోనే పెవిలియన్ కు పంపారు. దీంతో విలియమ్సన్ (32) కు జత కలిసిన మున్రో (37) ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 10 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ కోల్పోయి 90 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లంతా ధారాళంగా పరుగులిచ్చుకోగా, విల్లీ ఒక వికెట్ తీసి రాణించాడు.

  • Loading...

More Telugu News