: విమానాన్ని హైజాక్ చేసినా అతని కోరిక మాత్రం నెరవేరలేదు


'ఈజిప్ట్ ఎయిర్' సంస్థ విమానాన్ని హైజాక్ చేసినప్పటికీ హైజాకర్ సీఫ్ ఎల్దిన్ ముస్తఫా కోరిక తీరకపోవడం విశేషం. అనవసర ప్రచారంతో తనను ఇబ్బంది పెట్టిన భర్తను చూసేది లేదని సీఫ్ భార్య స్పష్టం చేసింది. కాగా సమాహా గురించి ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. 2011లో ఈజిప్టు అధ్యక్షుడు హోస్నీ ముబారక్ పై ప్రజా తిరుగుబాటు సందర్భంగా అరెస్టైన సీఫ్ జైలు నుంచి పరారయ్యాడు. దీంతో అతని పాస్ పోర్టును ఈజిప్టు అధికారులు సస్పెన్షన్ లో పెట్టారు. సీఫ్ దంపతులకు ఐదుగురు సంతానం కాగా, ఐదవ సంతానంగా జన్మించిన ఆడపిల్ల రోడ్డు ప్రమాదంలో మరణించింది. 24 ఏళ్లుగా తన భార్యాపిల్లలను చూసేందుకు ఈజిప్టు ప్రభుత్వం అంగీకరించడం లేదని ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారని సీఫ్ ప్రశ్నిస్తున్నాడు. కాగా, నిన్న ఉదయం అలెగ్జాండ్రియా నుంచి కైరోకు బయలుదేరిన ఈజిప్ట్ ఎయిర్ విమానాన్ని నడుముకు బెల్టు బాంబు కట్టుకుని హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. సైప్రస్ అధికారుల సంప్రదింపులతో దఫదఫాలుగా మొత్తం 81 మంది ప్రయాణికులు, విమాన సిబ్బందిని విడుదల చేసి, భద్రతాధికారులకు పట్టుబడ్డాడు. అతనిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న సమయంలో అతను విక్టరీ సింబల్ చూపడం విశేషం. అతనో మూర్ఖుడని, మానసిక రోగి అని సైప్రస్ అధికారులు పేర్కొనగా, అతనిని చూసేందుకు కూడా అతని భార్య అంగీకరించకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News