: రేడియో జాకీ చెంప ఛెళ్లుమనిపించిన అర్జున్ కపూర్
బాలీవుడ్ నటుడు ఆర్జున్ కపూర్ రేడియో మిర్చి ఆర్జే అర్పిత్ చెంప ఛెళ్లుమనిపించాడు. 'కీ అండ్ కా' సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న అర్జున్, కరీనా కపూర్ లు అందులో భాగంగా ముంబైలోని రేడియో మిర్చిలో ఏప్రిల్ ఒకటిన 'ఫూల్స్ డే' కార్యక్రమంలో ప్రసారం చేయనున్న ఎపిసోడ్ రికార్డింగ్ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆర్జే అర్పిత్ తో అర్జున్ కపూర్ ఓ ప్రాంక్ ప్లే చేశాడు. అర్జున్ కపూర్ ను అర్పిత్ 'ఏ పాత్రా దొరకనట్టు 'కీ అండ్ కా' సినిమాలో అమ్మాయి రోల్ ఎందుకు వేశావు?' అంటూ అర్జున్ ను అర్పిత్ ప్రశ్నించాడు. దీంతో కోపం తెచ్చుకున్న అర్జున్ ఆర్జే అర్పిత్ చెంప ఛెళ్లుమనిపించాడు. అయితే, ఇదంతా క్రియేటివిటీలో భాగమని వారు పేర్కొన్నారు. విదేశాల్లో ప్రాంక్స్ ప్లే (ప్రాక్టికల్ జోక్స్ లాంటివి) చేయడం సాదారణం.