: తదుపరి రాష్ట్రపతిగా అమితాబ్.. మోదీ మదిలో ఆ ఆలోచన ఉందంటున్న అమర్ సింగ్!


ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ త‌ర్వాత‌ రాష్ట్రపతి పదవికి బాలీవుడ్ నటుడు అమితాబ్ పేరును ప్ర‌ధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించే అవ‌కాశం ఉన్నట్లు తనకు తెలిసిందని సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ ఓ టివీ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రధాని ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు తనకు సమాచారం వుందని అమర్ సింగ్ అన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న‌ప్పుడు ఆయ‌న‌కు అమితాబ్ బచ్చన్ ను తానే ప‌రిచయం చేశాన‌ని చెప్పారు. ఆ పరిచయం తరువాతే మోదీ.. అమితాబ్ ను గుజరాత్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాల్సిందిగా కోరార‌ని చెప్పారు. కొన్ని రోజుల క్రితం బీజేపీ ఎంపీ శత్రుఘ్ను సిన్హా సైతం కాబోయే భారత రాష్ట్రపతిగా బిగ్ బీ అమితాబ్ బచ్చ‌న్ పేరును తెర‌పైకి తీసుకొచ్చారు. ప్రణబ్ ముఖర్జీ తర్వాత బాలీవుడ్ స్టార్ అమితాబ్ రాష్ట్ర‌ప‌తి అయితే తాను చాలా సంతోషిస్తానని బీజేపీ ఎంపీ శత్రుఘ్నుసిన్హా అన్నారు. క‌ల్చ‌ర‌ల్ ఐకాన్ బిగ్ బీ భార‌త్‌కు ప్రెసిడెంట్ అయితే చాలా గర్వకారణమని వ్యాఖ్యానించారు. సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో అమితాబ్ ఎన్నో మైలురాళ్లను అధిగ‌మించార‌ని ఆయ‌న‌ అన్నారు. బిగ్‌బీ ప్రెసిడెంట్ అయితే దేశానికి చాలా మంచి పేరు వస్తుందన్నారు.

  • Loading...

More Telugu News