: అదిరిపోయావు తమ్ముడూ!: సోదరుడి ఫస్ట్ లుక్ విడుదల చేసిన సోనమ్


బాలీవుడ్ లో మరోస్టార్ వారసుడు రంగప్రవేశం చేస్తున్నాడు. బాలీవుడ్ లో మాచో మేన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ కపూర్ తనయుడు హర్షవర్థన్ కపూర్ సినీ రంగ ప్రవేశం చేయనున్నాడు. 'మీర్జ్యా' సినిమా ద్వారా హర్షవర్థన్ కపూర్ బాలీవుడ్ తెరంగేట్రం చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను అతని సోదరి, సినీ నటి సోనమ్ కపూర్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఫస్ట్ లుక్ లో భలే ఉన్న తమ్ముడ్ని చూసిన సోనమ్ 'అదిరిపోయావు తమ్ముడూ' అంటూ వ్యాఖ్యను జోడించింది. ఈ సినిమాకు రాకేష్ ఓం ప్రకాశ్ మోహ్రా దర్శకుడుగా వ్యవహరిస్తుండగా, హర్షవర్థన్ కు జోడీగా సయామీ ఖేర్ నటిస్తోంది.

  • Loading...

More Telugu News