: ఆలయాల్లో మహిళల ప్రవేశాన్ని అడ్డుకోలేం: 'శని సింగణాపూర్' వివాదంలో బాంబే హైకోర్టు
మహారాష్ట్రలోని శనిసింగణాపూర్ ఆలయంలోకి మహిళలు రాకుండా నిషేధం విధించాలంటూ వేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు స్పందించింది. ఆలయంలో మహిళల ప్రవేశంపై గత కొన్ని రోజులుగా వివాదం నెలకొంది. దీనిపై బాంబే హైకోర్టు ఆలయాల్లో ప్రవేశించకుండా మహిళలను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. హిందూ చట్టం ప్రకారం ఇది సాధ్యం కాదని తెలిపింది. ఈ విషయంలో పురుషులతో పాటు మహిళలకు సమానహక్కులు ఉంటాయని పేర్కొంది. దీనిపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏప్రిల్ 1న ఈ కేసు విషయమై మరోసారి విచారణ చేపట్టనుంది. అదే రోజు మహారాష్ట్ర ప్రభుత్వ వాదనలు కూడా తెలపాలని ఆదేశించింది.