: ‘బోయింగ్’ ఉద్యోగులకు ఉద్వాసన!
కంపెనీ వ్యయం తగ్గించుకునే నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ బోయింగ్ తమ ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ఈ విషయాన్ని స్వయంగా సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఏడాదిలో 4,500 మంది ఉద్యోగులను తొలగించనున్నామని, 1600 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా తప్పుకుంటారని పేర్కొన్నారు. ఉద్వాసనకు గురయ్యే వారిలో ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్ స్థాయి ఉద్యోగులు కూడా ఉండవచ్చని సమాచారం.