: టీ20 ఉమెన్స్ వరల్డ్‌కప్: లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్.. విజయానికి మరో 43 పరుగుల దూరం
టీ20 ఉమెన్స్ వరల్డ్‌కప్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు ఇంగ్లాండ్ ముందు 133 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఒక వికెట్ నష్టానికి 90 పరుగులతో క్రీజులో ఉంది. ఇంగ్లాండ్ విజయానికి మరో 43 పరుగులు చేయాల్సి ఉంది.