: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావం... భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు


అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల ప్రభావం చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 438 పాయింట్లు లాభపడి 25,338 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 138 పాయింట్లు లాభపడి 7,735 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా, డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.38 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ లో ఐసీఐసీఐ బ్యాంకు షేరు ధర బాగా లాభపడింది. దీని షేరు ధర అత్యధికంగా 6.49 శాతం లాభపడి రూ.237.90 వద్ద ముగిసింది. దీంతో పాటు టాటా స్టీల్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, లుపిన్ సంస్థల షేర్లు కూడా లాభపడ్డాయి. ఇక, నష్టపోయిన షేర్ల విషయానికొస్తే, జీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ షేరు ధర అత్యధికంగా 1.34 శాతం నష్టపోయి రూ.376.80 వద్ద ముగిసింది. నష్టాలను చవిచూసిన వాటిలో మహీంద్రా అండ్ మహీంద్రా, హెడ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్ టెల్, మారుతీ సుజుకీ సంస్థ షేర్లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News