: కొడుకు పెళ్లికి 6,800 కోట్లు ఖర్చు చేసిన రష్యా కుబేరుడు


పెళ్లంటే పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, ఏడే అడుగులు, మూడే ముళ్లు... కానీ వీటిని ఏర్పాటు చేసుకునే విధానమే వారి వారి స్థాయిని బట్టి ఉంటుంది. కజకిస్థాన్ లో పుట్టి, రష్యా చమురు, మీడియా దిగ్గజంగా ఎదిగిన మిఖాయిల్ గుత్సరీవ్ తన కుమారుడి వివాహాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. వివాహ వేడుకను మాస్కోలోని లగ్జరీ హోటల్ లోని సఫియా బాంక్వెట్ హాల్ లో ఈ నిర్వహించారు. పుష్పాలంకృత భారీ వేదికపై 'నభూతో నభవిష్యతి' రీతిలో సయీద్ గుత్సరీవ్ (28) విద్యార్థి ఖదీజా ఉజకోవ్ ను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి 6,800 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని తెలుస్తోంది. ఈ పెళ్లిలో వధువు ధరించిన ఫ్రెంచ్ డిజైనర్ గౌనుకే సుమారు 16.20 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని తెలుస్తోంది. ఆహూతులను అలరించేందుకు జెన్నిఫర్ లోపెజ్, హెన్రిక్ ఇంగ్లేషియస్ వంటి అంతర్జాతీయ పాప్ స్టార్స్ తో కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివాహ వేదికను పూలవనంలా తీర్చిదిద్దారు. కాగా, మిఖాయిల్ గుత్సరీవ్ కు 38 వేల కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News