: చదివింది మూడో తరగతే... కానీ, సాధించింది మాత్రం ‘పద్మశ్రీ’!


ఆయన చదువుకున్నది మూడో తరగతే, కానీ, సాధించింది మాత్రం పద్మశ్రీ పురస్కారం. ఎంతో స్ఫూర్తి దాయకమైన ఆయన పశ్చిమ ఒడిశాకు చెందిన రచయిత హల్దార్ నాగ్. రెండు రోజుల క్రితం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు. కనీస విద్యార్హత కూడా లేని నాగ్ కు ఆ పురస్కారం దక్కడం వెనుక తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. * నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన ఎప్పుడూ చెప్పులు ధరించలేదు * పదేళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయారు * తండ్రి మరణంతో మూడో తరగతితోనే ఆయన చదువు ముగిసింది. బ్రతుకుదెరువు కోసం స్వీట్ షాపు లో పనివాడిగా కూడా చేశారు * గ్రామపెద్ద సాయంతో ఒక హైస్కూల్ లో వంటవాడి ఉద్యోగం చేశారు * పదహారేళ్ల పాటు అక్కడే పని చేసి, బ్యాంకు లోనుతో స్టేషనరితో పాటు, తినుబండారాలు అమ్మే దుకాణం ఏర్పాటు చేశారు * 1990లో ఆయన రాసిన మొదటి పద్యం ధోడో బర్గచ్ (పాత మర్రిచెట్టు) పత్రికలో ప్రచురించడంతో స్ఫూర్తి పొందిన హల్దార్ నాగ్ తన రచనా ప్రయాణాన్ని కొనసాగించాడు. ‘లోక్ కబి రత్న’గా ఆయన అక్కడ అందరికి సుపరిచితులు. * కోస్లి భాషలో ఆయన చాలా కవితలు, 20 రచనలు చేశారు * సంబల్ పూర్ యూనివర్శిటీ వాటిని ముద్రించే ప్రయత్నాల్లో ఉంది * నాగ్ జీవితంపై ఐదుగురు పరిశోధకులు పీహెచ్ డీ థీసిస్ లు రాశారు

  • Loading...

More Telugu News