: మహాత్మాగాంధీ వేషధారణలో అసెంబ్లీకి వెళ్లిన మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే
మధ్యప్రదేశ్ కు చెందిన ఒక ఎమ్మెల్యే జాతిపిత మహాత్మాగాంధీ వేషధారణలో అసెంబ్లీలో అడుగుపెట్టారు. భోపాల్ లోని హార్దా నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే దోగ్నే తన నియోజకవర్గంలోని పప్పుధాన్యాల పంటలకు సాగునీటి సరఫరా తక్కువగా ఉండటాన్ని నిరసించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వేషధారణలో ఈరోజు అసెంబ్లీకి హాజరయ్యారు. మహాత్ముడిలా ధోవతి, చేతిలో కర్ర, కళ్లజోడు ఆయన ధరించారు. తన గుర్తింపు కార్డును మెడలో వేసుకున్నారు.