: పాలు వృథా చేయకుండా అభిమానులకు రజనీకాంత్ విజ్ఞప్తి చేయాలి: కోర్టులో పిటిషన్
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా విడుదల అవుతోందంటే చాలు.. అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతారు. అర్ధరాత్రి నుంచే థియేటర్లకు చేరుకుంటారు. థియేటర్ల ముందున్న కటౌట్లకు పాలాభిషేకం చేస్తారు, స్వీట్లు పంచుతారు, కటౌట్లపై పూలవర్షం కురిపించి పండ్లు పంచిపెడతారు. బిజినెస్ పరంగా రజనీ సినిమాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇవన్నీ బానే ఉన్నాయి.. కానీ, ఆయన పోస్టర్లకు పెద్దఎత్తున క్షీరాభిషేకం చేస్తుండడంపై ఇప్పుడు రజనీపై ఒకరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన సినిమాలు విడుదల సందర్భంగా పాలు వృథా చేయకుండా.. అభిమానులకు రజనీకాంత్ విజ్ఞప్తి చేసేలా.. ఆదేశించాలని కోర్టును పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ కు వ్యతిరేకంగా బెంగళూరు కోర్టులో ఇన్ జంక్షన్ సూట్ ఫైల్ అయింది. దీనిపై రజనీకాంత్ ఎలా స్పందిస్తారనే విషయంపై ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది.