: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన స‌ల్మాన్ ఖాన్ చెల్లెలు


బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ చెల్లెలు అర్పితా ఖాన్ పండంటి మగబిడ్డకి జన్మ‌నిచ్చింది. ‘మా రాజకుమారుడు వచ్చాడు’ అంటూ అర్పితా ఖాన్ భ‌ర్త‌ ఆయుష్ ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపాడు. బాబుకి ‘అహిల్‌’ అని నామకరణం చేసినట్లు పేర్కొన్నాడు. ఆయుష్‌, అర్పితల వివాహం 2014 నవంబర్‌లో హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సెలబ్రెటీల సమక్షంలో చాలా గ్రాండ్ గా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. హిందూ, ముస్లిం సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. పెళ్లి సంద‌ర్భంగా అప్ప‌ట్లో త‌న‌ చెల్లికి సల్మాన్ రూ.16 కోట్ల విలువైన ఫ్లాట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు.

  • Loading...

More Telugu News