: ఆ మసీదును సందర్శిస్తా: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
లక్నోలో కొత్తగా నిర్మించిన ఒక మసీదును సందర్శించేందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సిద్ధమవుతున్నారు. మోహన్ లాల్ గంజ్ లోని మాధో ఆశ్రమంలో నిన్న జరిగిన ఒక కార్యక్రమానికి భగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ముస్లిం వుమన్ లా బోర్డ్ చైర్ పర్సన్ పైస్తా అంబర్ ఆయన్ని కలిశారు. మాధో ఆశ్రమానికి సమీపంలో తాను నిర్మించిన మసీదును సందర్శించాలని భగవత్ ను అంబర్ కోరగా, అందుకు ఆయన ఓకే చెప్పారని, ఈసారి లక్నో వచ్చినప్పుడు మసీదును సందర్శిస్తానని తనకు హామీ ఇచ్చారని అంబర్ పేర్కొన్నారు.