: చంద్రబాబు సర్కారుకు తలంటిన కాగ్!... ఖర్చులో ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని ఆక్షేపణ


ఏపీలో టీడీపీ సర్కారు నిధుల వినియోగంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు నిజమేనని తేలింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం సభ ముందుకు వచ్చిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తేల్చిచెప్పింది. ఒక పని కోసం నిర్దేశించిన నిధులను మరో పనికి బదలాయించిన టీడీపీ సర్కారు ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని కాగ్ తన నివేదికలో మొట్టికాయలేసింది. అంతేకాక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో సర్కారు జాప్యం కారణంగా ప్రాజెక్టుల వ్యయం 42.82 శాతం పెరిగిందని ఆక్షేపించింది. 2014-15 ఏడాదిలో ప్రాధాన్యత క్రమంలో నిధులను కేటాయించలేదని తప్పుబట్టింది. ఆధార్ కార్డుల కోసం కేటాయించిన రూ.12.61 కోట్లను గిరిజన ప్రాంతాల్లో ఖర్చు చేసిందని కాగ్ ఆక్షేపించింది.

  • Loading...

More Telugu News