: ముద్రగడకు చెక్ పడినట్లే!... కాపు ఎమ్మెల్యేలతో భేటీ కానున్న చంద్రబాబు


కాపులకు రిజర్వేషన్ల పేరిట భారీ ఉద్యమానికి కార్యాచరణ రూపొందించుకున్న కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇక తన ప్రణాళికను అటకెక్కించక తప్పేలా లేదు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన కాపు నేతలను విజయవాడ పిలిపించుకున్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రత్యేకంగా నిర్వహించిన భేటీ సత్ఫలితాలను ఇచ్చింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని, అందులో భాగంగా కాపు కార్పొరేషన్ కు రూ.1,000 కోట్ల కేటాయింపుతో బాటు, కాపు కమిషన్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. ఇకపై ఉద్యమం పేరిట ముద్రగడ ఇచ్చే పిలుపునకు స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. బొండా ఉమ వాదనతో ఏకీభవించిన కాపు నేతలు ముద్రగడ ఉద్యమాలకు కాస్తంత దూరంగా ఉంటామని ప్రకటించారు. తాజాగా సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి సాయంత్రం కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. నేటి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు రావాలని సీఎంఓ నుంచి కాపు వర్గ ఎమ్మెల్యేలకు సందేశాలు వెళ్లాయి. భేటీలో భాగంగా కాపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు మనసు విప్పి మాట్లాడనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News