: గాయని సుశీలకు చంద్రబాబు అభినందనలు
గిన్నిస్ రికార్డు సాధించిన గాన కోకిల పి.సుశీలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. ఆరు భాషల్లో 17 వేలకు పైగా పాటలు పాడటం సుశీలకే సాధ్యమైందని, ఆమె గిన్నిస్ రికార్డు నమోదు చేయడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని చంద్రబాబు అన్నారు. కాగా, ఆరు భాషల్లో సోలో, డ్యూయట్, కోరస్ లతో కలిపి మొత్తం 17,695 పాటలు పి.సుశీల పాడింది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె వేలాది యుగళగీతాలను ఆలపించారు.