: ఉపగ్రహం ఆకృతిలో మానవహారం... గుంటూరు ఇంజనీరింగ్ కళాశాల రికార్డు
గుంటూరు జిల్లా వట్టి చెరుకూరులోని మలినేని పెరుమాల్ ఇంజనీరింగ్ కాలేజ్ రికార్డు సృష్టించింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో కళాశాల విద్యార్థులు, సిబ్బంది స్థానం దక్కించుకున్నారు. మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం స్మారకార్థం విద్యార్థులతో మానవహారాన్ని ఉపగ్రహం ఆకృతిలో ఏర్పాటు చేశారు. ఇటువంటి ఆకృతిలో మానవహారం ఏర్పాటు కావడం ఇదే మొదటిసారని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకటించింది. 2016 మంది విద్యార్థులు, సిబ్బంది పేర్లు ఈ రికార్డుల్లోకి ఎక్కాయి. కళాశాల రికార్డు సాధించిన విషయాన్ని త్వరలోనే గిన్నిస్ బుక్ కు సిఫార్సు చేస్తామని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు పేర్కొన్నారు.