: బ్ర‌స్సెల్స్‌లో మోదీకి ఘ‌న‌స్వాగ‌తం


ప్రధాని నరేంద్రమోదీ బెల్జియం రాజ‌ధాని బ్ర‌స్సెల్స్‌ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. బ్రసెల్స్‌లో జరిగే 13వ ఇండియన్‌ యూరోపియన్‌ యూనియన్‌ సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బెల్జియం వెళ్లడం ఇదే తొలిసారి. బెల్జియం ప్రధాని ఛార్లెస్‌ మైఖెల్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమెరికా, సౌదీ అరేబియా దేశాలలో కూడా ఆయ‌న‌ పర్యటిస్తారు. బెల్జియం పర్యటన త‌ర్వాత‌ మోదీ.. ఈనెల 31వ‌ తేదీన వాషింగ్టన్‌లో జరిగే నాల్గో అణుభద్రత సదస్సులో పాల్గొంటారు. అనంత‌రం సౌదీ అరేబియాలో... ఏప్రిల్ 2వ‌ తేదీన ప‌లు చ‌ర్చ‌ల్లో పాల్గొన‌నున్నారు.

  • Loading...

More Telugu News