: సభకు రాని ఆ 8 మంది!... అనారోగ్యమే కారణమంటూ ‘విప్’ కౌంటర్


ఏపీ అసెంబ్లీలో ఉత్కంఠకు తెర పడింది. ద్రవ్య వినిమయ బిల్లుపై జరగనున్న ఓటింగ్ కు తప్పనిసరిగా హాజరుకావాలంటూ వైసీపీ జారీ చేసిన విప్ ను ఆ పార్టీ నుంచి టీడీపీలోకి చేరిన 8 మంది ఎమ్మెల్యేలు ఏమాత్రం పట్టించుకోలేదు. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన చివరి రోజు సమావేశాలకు వారు గైర్హాజరయ్యారు. వెరసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వారు ఝలక్కిచ్చారు. ఇక విప్ ను ధిక్కరించి సభకు హాజరుకాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్న జగన్ యోచనకు వారు ఆదిలోనే అడ్డుపుల్ల వేశారు. అనారోగ్యం కారణంగానే తాము సభకు హాజరుకాలేకపోయినట్లు ఆ 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెల శివప్రసాద్ కు లేఖల ద్వారా తెలిపారు.

  • Loading...

More Telugu News