: కోహ్లీ బ్రాండ్ ‘రాంగ్’!... హైదరాబాదులో ఔట్ లెట్ ఓపెన్!


టీమిండియా చిచ్చర పిడుగు విరాట్ కోహ్లీ బ్రాండెడ్ స్పోర్ట్స్ వేర్ తెలుగు నేలలోకి రంగ ప్రవేశం చేసింది. ‘రాంగ్’ పేరిట ఇప్పటికే అందుబాటులోకి వచ్చేసిన ఈ బ్రాండెడ్ ఉత్పత్తులు తాజాగా హైదరాబాదీల దరికీ చేరాయి. నిన్న హైదరాబాదులో ‘రాంగ్’ ఔట్ లెట్ ఓపెన్ అయిపోయింది. విరాట్ కోహ్లీ, తెలుగు నేలకు చెందిన అంజనారెడ్డిలు ‘యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్ ప్రైవేట్ లిమిటెడ్(యూఎస్పీఎల్)’ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా కొంతమేర పెట్టుబడి పెట్టాడు. ఎక్స్ క్లూజివ్ ఔట్ లెట్లతో పాటు రిటెయిల్ చెయిన్ దిగ్గజం ‘షాపర్స్ స్టాప్’ స్టోర్ల ద్వారా కూడా ‘రాంగ్’ బ్రాండ్ విక్రయాలను మొదలుపెట్టినట్లు అంజనారెడ్డి తెలిపారు. రానున్న మూడేళ్లలో ‘రాంగ్’ ఔట్ లెట్ల సంఖ్యను వందకు పెంచనున్నామని చెప్పిన ఆమె, ఈ ఏడాది ఐదింటిని ఏర్పాటు చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News