: బ్రస్సెల్స్ ‘ఉగ్ర’దాడిని ఖాతరు చేయని మోదీ... బెల్జియం బయలుదేరిన ప్రధాని
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ ఎయిర్ పోర్టు, మెట్రో స్టేషన్లపై మొన్న జరిగిన ఉగ్రవాద దాడులు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఏమాత్రం నిలువరించలేకపోయాయి. ఉగ్రవాద దాడితో అతలాకుతలమైన బ్రస్సెల్స్ లో పర్యటించేందుకు మోదీ కొద్దిసేపటి క్రితం బయలుదేరారు. బెల్జియం, అమెరికా, సౌదీ అరేబియా దేశాల్లో పర్యటించేందుకు మోదీ బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లోనే ఆయన ల్యాండవనున్నారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలతో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకునే క్రమంలో మోదీ బ్రస్సెల్స్ లో పర్యటిస్తున్నారు. బ్రస్సెల్స్ లో పర్యటన ముగించుకున్న తర్వాత మోదీ... తొలుత అమెరికా, ఆ తర్వాత సౌదీ అరేబియాల్లో పర్యటనను ముగించుకుని తిరిగి భారత్ కు చేరుకుంటారు.