: ‘అసెంబ్లీలో ఎన్టీఆర్ ప్రసంగాలు’ పుస్తకావిష్కరణ


తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలకు పుస్తకరూపం కల్పించారు. ఈ పుస్తకాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, ఈరోజు టీడీపీ ఆవిర్భావ దినోత్సవమని, ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రసంగాలను పుస్తకరూపంలో తీసుకువచ్చామని అన్నారు. ఎన్టీఆర్ భాష, భావ వ్యక్తీకరణ చాలా అద్భుతంగా ఉండేవని అన్నారు. ప్రజలను చైతన్య పరిచేలా ఆయన ప్రసంగాలు ఉండేవన్నారు. 1978 నుంచి తాను అసెంబ్లీకి వస్తున్నానని, ఆ సమయంలో పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న, రాజేశ్వరరావు వంటి గొప్ప నాయకులు ఉండేవారని అన్నారు. ఆ రోజుల్లో విలువలతో కూడిన నాయకత్వం ఉండేదన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పులు సంభవించాయన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, మండల వ్యవస్థ, సింగిల్ విండో విధానం మొదలైన అంశాలపై చంద్రబాబు మాట్లాడారు.

  • Loading...

More Telugu News