: గుంటూరు జిల్లా ఎడ్లపందాలలో అపశ్రుతి
వచ్చే ఉగాదిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తెనాలిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎడ్ల పందాల్లో ఈ రోజు అపశ్రుతి చోటుచేసుకుంది. బల ప్రదర్శన సందర్భంగా చుట్టూ ఉన్న ప్రజలు చేసిన కేకలతో బిత్తరపోయిన ఎడ్లు అదుపుతప్పి పరుగులు తీశాయి. దీంతో అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే, జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్యను అవి తీవ్రంగా గాయపర్చాయి. దీంతో ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆయన ఆరోగ్యపరిస్థితిపై సమాచారం అందాల్సి ఉంది. కాసేపటి క్రితం ఈ ఎడ్ల పందాలను సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య ప్రారంభించిన సంగతి తెలిసిందే.